9 June, 2026 | 8:16 PM

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్, రిమాండ్

09-06-2026 06:47 PM

కామారెడ్డి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

కామారెడ్డి ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ అధికారి హనుమంతరావు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారి సంపత్ కృష్ణతో పాటు ఇతర సిబ్బంది కలిసి కామారెడ్డి రైల్వే స్టేషన్లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కామారెడ్డి రైల్వే స్టేషన్లో నాగవల్లి ఎక్స్ప్రెస్ సంబల్పూర్ నుండి పూణే కి వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుండి సుమారు 10 కిలోల ఎండు గంజాయి లభించిందని వారు తెలిపారు.

ఆ ఇద్దరి వ్యక్తులు మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్ మరియు ప్రవీణ్ అని తెలిసింది.నిందితులు ఇద్దరి నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు. నిందితులు ఒరిస్సా లోని రాయగడ్ లో ఎండు గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని రాయపూర్ కు రవాణా చేయుచున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఈ తనిఖీలలో సిఐ సంపత్ కృష్ణ తోపాటు ఎస్ఐ విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్స్ జాన్ బలవంతరావు, ఫరీద్ సిబ్బంది రాజు, పవన్ రెడ్డి, బాబు,శరత్,వందన తదితరులు పాల్గొన్నారు.