డంపింగ్‌యార్డ్ 20 జీవోను రద్దు చేయాలి
14 గ్రామాల ప్రజల భారీ పాదయాత్ర
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 14(విజయక్రాం తి): ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డ్ (ఎకో టౌన్) ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరిం చుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్య మం తప్పదని పరిసర బాధిత గ్రామాల స ర్పంచులు, ప్రజలు హెచ్చరించారు. రంగారె డ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల రెవెన్యూ పరిధిలో 494 ఎకరాల లో ఈ యార్డ్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 20ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు చిన్న రావిరాల గ్రామ సర్పంచ్ పబ్బతి బాలకిషన్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం బాధిత 14 గ్రామాల ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు కలిసి గువ్వలేటి చౌరస్తా నుంచి సద్దుపల్లి ఎక్స్ రోడ్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సద్దుపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి, డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు, వాయువు కలుషితమై శ్వాసకోశ వ్యాధులు వస్తాయని, పక్కనే ఉన్న విద్యాసంస్థల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఈస్ట్ సైడ్ కూడా మిగతా ప్రాంతాల తరహాలోనే సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులతో పాటు బండరావిరాల, పిల్లాయిపల్లి, దేశ్ముఖ్, జగత్పల్లి, పెద్దగూడెం, కవాడిపల్లి గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






