అనురాగ్ విశ్వవిద్యాలయం విద్యార్థినికి డాక్టరేట్ ప్రదానం
ఘట్ కేసర్, జూన్ 14 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అం డ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని చంద్రకళ ము క్కు అడ్వానస్డ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఆఫ్ లైన్ తె లుగు హ్యాండ్ రిటన్ క్యారెక్టర్ అండ్ వర్డ్ రికగ్నిషన్ సిస్టమ్ అనే అంశంపై పరిశోధన నిర్వ హించి, మార్గదర్శకులు డాక్టర్ సంతోష్ మి ర్యాల పర్యవేక్షణలో తన పరిశోధనను పూ ర్తి చేశారు. ఈపరిశోధనకు సంబంధించిన వై వా వోస్ పరీక్ష 2026 జూన్ 3వ తేదీన నిర్వహించగా, ఈపరీక్షకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచ్చి, ఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి. పళనిసామి బాహ్య పరీక్షకుడిగా పాల్గొన్నారు.
అనురాగ్ విశ్వవిద్యాల య పరీక్షల విభాగ డీన్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వైవా వోస్ పరీక్షలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా క్టర్ సికిందర్ బాబా, ఇతర విభాగాల అధిపతులు, ప్రొఫెసర్ల సమక్షంలో చంద్రకళ తన పరిశోధనను విజయవంతంగా వివరించి స మర్పించారు. పరీక్షకుల కమిటీ సిఫారసుల ఆధారంగా చంద్రకళకి ఆఫ్ ఫిలాసఫీ (పీ హెచ్ డి) పట్టా ప్రదానం చేయబడింది.






