22 May, 2026 | 11:35 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.45 కోట్ల నిధులు మంజూరు

08-01-2026 01:20 AM

అలంపూర్, జనవరి 7: గద్వాల జిల్లాలోని అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు ఒక్కొక్క మున్సిపాలిటీకి రూ.15 కోట్లు చొప్పున  మూడు మున్సిపాలిటీలకు కలిపి మొత్తం రూ. 45 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ విడుదల చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్ వడ్డేపల్లి దేవేంద్ర తెలిపారు.ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని సంపత్ కుమార్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు.

అనంతరం మూడు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కృషిచేసిన సంపత్ కుమార్ కు కృతజ్ఞత తెలిపారు.అనంతరం మాట్లాడుతూ ... రేపు జరగబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను అత్యధిక భారీ మెజార్టీతో  గెలిపించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు మరింత నిధులు వచ్చేందుకు కృషి చేస్తానని సంపత్ కుమార్ తెలిపారు. ప్రతి కార్యకర్తకు అన్ని విధాలుగా తోడు ఉంటానని హామీ ఇచ్చారు.