5 August, 2026 | 1:53 AM

ఇంధన ధరలు తగ్గించాలి

05-08-2026 01:07 AM

ఆప్ రాష్ట్ర కన్వీనర్  హేమ సుదర్శన్ 

ముషీరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఈ-20 పెట్రోల్ వల్ల వాహన దారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు ఆధ్వర్యంలో  నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు  మంగళవారం వెల్లడించారు.  పలువురు వాహనదారులకు  ఈ-20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలను వివరించారు. 

ఈ-20పై కేంద్ర ప్రభుత్వం పూర్తి సమాచారం, వాహన అనుకూలత, వినియోగదారుల హక్కుల విషయంలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై ఇంధన భారం తగ్గించకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ వింగ్ అధ్యక్షుడు మీరేటి ఆంజనేయులు, ఉప్పల్ ఇన్చార్జి మల్లికార్జున్, రాష్ట్ర నాయకుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.