గుర్రపు తండాలో ఉచిత మెగా వైద్య శిబిరం
04-04-2026 12:34 AM
దేవరకొండ (కొండ మల్లేపల్లి) ఏప్రిల్ 3: గుర్రపు తండాలో జైరామ్ హాస్పిటల్ సౌజన్యంతో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరంను గ్రామ కార్యాలయంలో సర్పంచ్ రామావత్ సేవ నాయక్ ప్రారంభించి మాట్లాడారు.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ శిబిరంలో సుమారు వంద మంది గ్రామస్థులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. షుగర్, బీపీ పరీక్షలు చేసిన అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వి భరత్ సింగ్, గ్రామ పంచాయతీ సభ్యులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




