15 June, 2026 | 11:12 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆంధ్రోళ్ల మాటలేంది.. తెలంగాణలో మరో ఉద్యమం వస్తది!

04-04-2026 02:16 AM
  1. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డే అనడమేంటి?
  2. కొందరు ధనిక ఆంధ్ర నాయకుల మాటలు సరైనవికావు
  3. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఆగ్రహం

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఆంధ్రాకు చెందిన కొం దరు ధనిక రాజకీయ నేతలు తెలంగాణలో ఉంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు హైదరాబాద్‌లో చదువుకొని స్కూలు ను నిర్వహిస్తూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’గా అభివర్ణించడం ఏంటని ఆయన మండిపడ్డారు.

ఇలాంటి మాటలతో తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా తనను గత రెండు మూడు రోజులుగా ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు చేస్తూ తెలంగాణలో ఉంటున్న ఆంధ్రవాళ్లు తనలాగే సామాన్యులని, స్థానికులకు వారు తగినవిధంగా గౌరవం ఇస్తారని అనిరుద్ రెడ్డి చెప్పారు. అయితే ఆంధ్రోళ్లలో ఆర్థికంగా బాగా ఉన్న వారు ఇప్పటికీ స్థాని కులను చులకనగా చూస్తున్నారని అన్నారు.

డ్రగ్స్ టెస్టులకు సంబంధించి తను మాట్లాడడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.  తెలంగాణ రాజకీయ నాయకులకు లై డిటెక్టర్ టెస్టు పెట్టాలని హైదరాబాద్‌లో కూర్చొని చీఫ్‌గా మాట్లాడుతున్నారన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారికి అంత స్వేచ్ఛ ఉందనే విషయాన్ని గమనించాలని ఎమ్మెల్యే అన్నా రు. పరిస్థితులు ఇలాగే ఉంటే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని చెప్పా రు.

ఇటీవల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలోనివారు ప్రతి ౯౦ రోజులకొకసారి డ్రగ్స్ టెస్టు చేసుకోవాలని వ్యాఖ్యానించడంతో.. సినిమా పరిశ్రమలో హీరో మంచు విష్ణు, నటుడు రాహుల్ రామకృష్ణ తదితరులు ‘రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుంటారా’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎన్నికలప్పుడు నామినేషన్లతో పాటు రాజకీ య నాయకులు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

‘కొందరు మీ స్థాయి ఏంటని అడుగుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. ఆదర్శంగా నిలబడాలనే సంకల్పంతో నేను మాట్లాడ డం జరిగింది. శ్రీరామచంద్రుడే సీతాదేవికి ఎన్నో పరీక్షలు పెట్టారు. మనం చేసుకుంటే తప్పు ఏముంటుంది? తలపై నుంచి ఎన్నో వెంట్రుకలు ఊడిపోతాయి.. టెస్టులకు ఒకటి రెండు వెం ట్రుకలు ఇస్తే సరిపోతుంది. పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ముందుకు సాగితే నే ను చెప్పింది నిజమా? కదా? తెలుస్తుం ది’ అని ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చెప్పారు.