4 April, 2026 | 4:18 AM

దొడ్డి కొమరయ్య గొప్ప విప్లవ వీరుడు

04-04-2026 02:22 AM

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ఎల్బీనగర్, ఏప్రిల్ 3: దొడ్డి కొమురయ్య గొప్ప విప్లవ వీరుడు, దొరలపై పోరాటం చేసిన గొప్ప మహనీయుడు అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. శుక్రవారం  ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో కురుమ యువ చైతన్య సమితి ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ తదితరులు ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కురుమ యువ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షుడు కాలిన మల్లేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుండే వెంకటేశ్ కురుమ, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.