4 April, 2026 | 4:11 AM

రిజర్వేషన్ సాధనకు రాజీనామాకైనా సిద్ధం

04-04-2026 02:24 AM

ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో ముదిరాజ్ వర్గం ఎదుర్కొంటున్న రిజర్వేషన్ సమస్యలు త్వరలో పరి ష్కారం కానట్లయితే మంత్రి వాకిటి శ్రీవారితో కలిసి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిగూడ ముదిరాజ్ భవన్ లో  రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అత్యవసర సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో ముదిరాజ్ సమన్వయ కమిటీ ఏర్పాటు అవసరం, బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్పు వ్యూహాలు, కోకాపేటలో ముదిరాజ్ భవన నిర్మాణం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి వాకిటితో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చా రు. సంఘం గౌరవ అధ్యక్షుడు బలరాం ముదిరాజ్ మాట్లాడుతూ రిజర్వేషన్ అంశ ంలో గతంలో జరిగిన తప్పిదా లను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం కోర్టుకు సరైన సమాచారం అందకపోవడం వల్ల న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చింతల నిలకంఠం ముదిరాజ్, సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షులు గోనెల కుమారస్వామి ముదిరాజ్, పాండు ముదిరాజ్, శివ ముదిరాజ్, సుగ్రీవ్ ముదిరాజ్, అనిల్ కుమార్ ముదిరాజ్, మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.