12 May, 2026 | 8:30 PM

Breaking News

వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •  

ఏసుప్రభు జీవితం అందరికీ ఆదర్శం

23-12-2025 07:38 PM

క్రాంతి విద్యాలయం కరస్పాండెంట్ సమత శ్రీనివాస్ 

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం క్రాంతి విద్యాలయంలోఫ్రీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి సమత శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుప్రభు చూపిన ప్రేమ, దయా,కరుణ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దైవచింతనతో ఇతరులకు చేయూతనివ్వడమే యేసుక్రీస్తు బోధనల పరమార్థం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రీ ప్రైమరీ చిన్నారులు శాంటా క్లాస్, దేవదూతల వంటి వివిధ వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ .హేమ శిల్ప అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.