26 April, 2026 | 4:22 PM

బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

26-04-2026 03:03 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు  వంద శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు మంజూరు చేస్తే స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఉపయోగపడుతుందని,  మంత్రి తెలిపారు. 

పథకం అమలుపై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీతో  మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుంది..