24 April, 2026 | 4:19 AM

ఏకాభిప్రాయంతో నాలుగు కో-ఆప్షన్ పదవులు ఏకగ్రీవం

24-04-2026 01:11 AM

బీఆర్‌ఎస్ నేత గోవర్ధన్రెడ్డి

గుమ్మడిదల, ఏప్రిల్ 23: కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రాజెక్టుపై ఉన్న అసత్య ఆరోపణలు తొలగిపోయి నిజం వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

గురువారం మండల కేంద్రంలోని సిజిఆర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కేసీఆర్, హరీష్ రావుల చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైందని, ప్రాజెక్టుపై అవగాహన లేకుండా విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలకు ఇది గట్టి సమాధానమని పేర్కొన్నారు.

దేశంలోనే అతిపెద్ద నీటి ప్రాజెక్ట్ కాలేశ్వరం నిర్మాణం లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జరిగిందని తెలిపారు.దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంతో ఎండి ఫయాజుద్దీన్, షేక్ నూర్జహాన్, సద్ది విజయ భాస్కర్ రెడ్డి, వెంకట్రాం కలమ్మలను సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.