ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ
15-07-2026 12:00 AM
చెక్కు పంపిణీ చేస్తున్న నాఫ్స్కాబ్ చెర్మన్ కొండూరు రవీందర్ రావు
గంభీరావుపేట, జూలై 14 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద రూ.2 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. మండలానికి చెందిన రైతు దాసరి దేవరాజు అనారోగ్యంతో రెండు నెలల క్రితం మృతి చెందగా, ఆయన కుటుంబానికి ఈ బీమా సాయం అందింది.
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు చేతుల మీదుగా మృతుడు దాసరి దేవరాజు భార్య దాసరి చంద్రకళకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సురభి ప్రవీణ్ రావు, ఫీల్ ఆఫీసర్ దుర్గం, సొసైటీ సీఈవో సందుపట్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






