15 July, 2026 | 12:00 AM

జక్కిడి శివచరణ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డికి షోకాజ్

15-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. బీసీ నాయకులు, బీసీ కులాలపై శివచరణ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పలువురు బీసీ నాయకులు మంగళవారం టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదులు అందజేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందుకు స్పందించిన క్రమశిక్షణ సంఘం.. ఇరువురికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.