27 June, 2026 | 1:20 AM

ఇందిరమ్మ గృహప్రవేశానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరు

27-06-2026 12:31 AM

తూప్రాన్, జూన్ 26: శుక్రవారం మున్సిపల్ పరిధిలోగల పదో వార్డు బ్రాహ్మణపల్లి లో చింత మంజుల రాజిరెడ్డికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా గృహాన్ని సంపూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం నూతన గృహప్రవేశానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డినీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

అనంతరం వారి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. ఇందులో నాచారం దేవాలయ చైర్మన్ రవీందర్ గుప్తా, బుచ్చిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మామిళ్ళ కృష్ణ, భగవాన్ రెడ్డి, వేణు, సత్యనారాయణ, బిక్షపతి, రవి, లక్ష్మణ్, సిద్ధగౌడ్, శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.