మొహర్రం వేడుకల్లో పాల్గొన్న గాంధీ
కూకట్ పల్లి, జూన్ 26 (విజయక్రాంతి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో హైదర్ నగర్ లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మొహర్రం వేడుకలలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్థానిక మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నిర్వాహకులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మొహర్రం కేవలం పండుగ మాత్రమే కాదని, ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి పవిత్ర మాసం నూతన సంవత్సర ప్రారంభమన్నారు. మహమ్మద్ ప్రవక్త మనవడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యుల త్యాగాలను, ధర్మ పోరాటాన్ని స్మరించుకుంటూ చేసుకునే పవిత్రమైన మాసం మొహర్రం పండగ అన్నారు. మొహర్రమును పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, పోతుల రాజేందర్, చాట్ల రవి, రాజేష్, యాసీన్, నిఖిల్, హమీద్, ఫసి తదితరులు పాల్గొన్నారు.






