నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కందాళ
01-05-2026 01:10 AM
కూసుమంచి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కూసుమంచి మండలం పెరికసింగారం, పాలేరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. పాలేరు బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు బత్తుల జానయ్య- సుధారాణి కూతురు *సృజన- ఉమాకాంత్ లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
కిష్టాపురం గ్రామం చిన్నం నాగలక్ష్మి- శ్రీనివాసరావు కుమారుడు ఉదయ్ - ప్రవళికలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






