1 May, 2026 | 2:45 AM

రైతు గోస పట్టదా?

01-05-2026 01:11 AM
  1. కొనుగోలు కేంద్రాల్లోనే రైతు కుటుంబాల పడిగాపులు 
  2. నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే!

యాదాద్రి భువనగిరి /ఆలేరు ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ర్టంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా కష్టా లు పడుతున్నారని, అయినా రైతు గోస పట్టని ప్రభుత్వం ఇది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నా రు. గురువారం ఆయన భువనగిరి మం డలం హన్మాపురంలో ధాన్యం కొనుగో లు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం రాశులను పరిశీలించారు. ధాన్యం అమ్ముకోవడానికి పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

రైతులు చెప్పిన బాధలు విన్న ఆయన అధైర్యపడవద్దని, మీరు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసేవరకు మీ వెంట మేముంటామని భరోసా ఇచ్చారు. అదనపు కలెక్టర్ కే వెంకారెడ్డికి ఫోన్‌చేసి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు జరుగుతున్నదని ఆయన ప్రశ్నించారు. వెంటవెంటనే ధాన్యం కొనుగోల్లు చేస్తామని, లారీలను రప్పించి వెంటవెంట మిల్లులకు తరలిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.

అనంతరం రాంచందర్‌రావు అక్కడే విలేఖరులతో సమావేశం నిర్వహించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కే సైదులు అటు కొనుగోల్లు లేక, రైతుల బాధలు, మిల్లర్ల వేదింపులు వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేయడం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వ్యవస్థను కుప్పకూల్చిందనడానికి నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యంతో రైతులు, కుటుంబ సభ్యులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులుకాస్తున్న సీఎంకు, వ్యవసాయ మంత్రికి ఏమాత్రం పట్టింపు లేదని విమర్శించారు.

వానలకు తడుస్తూ, ఎండలకు ఎండుతూ పన్నెండు శాతం తేమ ఉన్నా కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారన్నారు. రైతులను గత ప్రభుత్వం మోసం చేసింది.. ఈ ప్రభుత్వం కూడ అదే బాటలో పోతుందన్నారు. రైతులను పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వనీకి పట్టిన గతే దీనికి పడుతుందన్నారు. రైస్ మిల్లర్లు, దళారులు, అధికారులు కుమ్ముక్కు రైతులు దోపిడికి గురైతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌఖర్యాలు లేక అడివిపందులు, పందికొక్కులతో ధాన్యం నాణ్యత దగ్గుతుందన్నారు.

ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని వెంటవెంటనే కొనుగోలు చేపట్టాలని కోరారు. రాష్ర్టంలో ప్రతిధాన్యం గింజను కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ర్టం కొనుగోలు చేస్తుందని, దబ్బుడం నుంచి డబ్బువరకు అన్ని కేంద్రమే సమకూరుస్తున్నా.. కేవలం సేకరణ కూడ చేతకాని ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే రైతుల సమస్యలు పట్టించుకుని ధాన్యం కొను గోల్లు వెంటవెంటనే చేపట్టకపోతే ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు బి. లక్ష్మీనర్సయ్య, రాష్ట్రనాయకులు కాసం వెంకటేశ్వర్లు, వేముల అశోక్, గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, పడాల శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, గొలి మధుసూదన్ రెడ్డి, పడమటి జగన్మోహన్ రెడ్డి, వంగేటి విజయభాస్కర్రెడ్డి, చందా మహేందర్ గుప్తా, పక్కీరు రాజేందర్రెడ్డి, మాయ దశరధ, సుర్వీ శ్రీనివాస్, చీరిక సురేష్ రెడ్డి, పనుమటి మాణిక్యం రెడ్డి, బూరుగు మణికంఠ, ఎండీ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.