నవ దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర
01-05-2026 01:08 AM
సత్తుపల్లి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామానికి చెందిన గుర్రం నాగ ప్రసాద్ - అన్నపూర్ణ కుమార్తె భవాని వివాహ వేడుకకు హాజరైన బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నవ దంపతులను ఆశీర్వదించారు.
సత్తుపల్లి పట్టణం కల్పతరురోడ్ సాయిరాఘవ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న గడ్డం జయలక్ష్మి- వరప్రసాద రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






