26 May, 2026 | 2:42 AM

మాజీ కౌన్సిలర్ పార్థ్థీవదేహాన్ని మోసిన మాజీ మంత్రి

26-05-2026 12:00 AM

ఆదిలాబాద్, మే 25 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ ధారవేణి సత్యనారాయణ (73) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున మరణించారు. దీంతో శాంతినగర్ లోని తన ఇంటి ఎదుట ఉంటున్న సత్యనారాయణ మృతితో మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనంతరంజరిగిన అంత్యక్రియాల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని స్వయంగా పాడే మోశారు. సత్యనారాయణ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తీరని లోటని జోగు రామన్న అన్నారు.సత్యనారాయణ బీఆర్‌ఎస్ పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అంత్యక్రియల్లో పార్టీ నాయకులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, జోగు మహేందర్, అడప తిరుపతి, పాశం రాఘవేంద్ర, కొండ గణేష్, బొజ్జ సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు.