అట్టహాసంగా మహిళా వారోత్సవాలు
మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంమన్న జిల్లా కలెక్టర్...
ఆదిలాబాద్, మే 25 (విజయ క్రాంతి) :మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో మహిళా అభివృద్ధి, శి శు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్ శక్తి‘ మహిళా వారోత్సవాలకు ము న్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష, మార్కె ట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ల తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా రంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న మెడికల్, అంగన్వాడీ స్టాల్ లను సందర్శించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళ ఉద్యోగులకు మెమొంటో లను అందజేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మ హిళల రక్షణ, భద్రత, ఆరోగ్యం, వారి ఆర్థిక స్వావలంబన సాధించడమే ‘మిషన్ శక్తి‘ యొక్క ముఖ్య ఉద్దేశమని, సమాజంలో మ హిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా వారో త్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ వారోత్సవాలు నేటి నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయని, మహిళా చట్టాలు, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యం, స్వయం ఉపాధి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అదేవి ధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు అన్ని రకాల స్కానింగ్లు, వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. మహిళలు రక్తహీనతను జయించడానికి నిత్యం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలన్నారు. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర ఉండే ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ వల్ల చిన్న వయసులోనే బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తూ ‘సే నో టు జంక్ ఫుడ్‘ అని పిలుపునిచ్చారు.
ఇంట్లో వండుకునే జొన్న రొట్టెలు, సాంప్రదాయ ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో జరిగే అన్ని అవగాహన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మహిళల్లో ఈ అంశాలపై ఆశా కార్యకర్తలు, టీచర్లు, ఏఎన్‌ఎంలు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, సంబంధిత శాఖల అధికారులు, పర్యవేక్షకులు, అంగన్వాడీలు, మహి ళలు, సఖి కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






