26 May, 2026 | 1:55 AM

1/70 చట్టం జోలికొస్తే ఊరుకోం తుడుందెబ్బ హెచ్చరిక

26-05-2026 12:00 AM

జైనూర్, మే 25 (విజయ క్రాంతి): ఆదివాసీల ప్రాణధారమైన 1/70 భూ బదలాయింపు నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తుడుందెబ్బ తీవ్రంగా ఖండించింది. జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో నెం-3 రద్దు చేయించిన శక్తులే ఇప్పుడు ఆదివాసీల గుప్పెడు భూములను లాక్కోవడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.1970 సవరణ చట్టం ఉద్దేశం ఆదివాసీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటమేనని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బలమైన కౌంటర్ అఫిడవిట్ వేసి చట్టాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. జీవో నెం-3 పోయినా సహించాం, 1/70 చట్టం జోలికొస్తే సహించం. అవసరమైతే ఉధృత ఉద్యమం చేస్తాం అని హెచ్చరించారు.ఆదివాసీ సంఘాలు, యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మధురాజ్ మడావి, నాయకులు మడావి నగేష్, జుగ్నాక ధర్మేందర్, ఆత్రం అర్జున్, తుమ్రం దిలీప్, మెస్రం జ్ఞానేశ్వర్, గెడం నగేష్, తదితరులు పాల్గొన్నారు.