31 July, 2026 | 4:14 AM

ఏఐజీ ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్

31-07-2026 02:12 AM

మనుమడు హిమాన్షుకు పరామర్శ

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన మనుమడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు చిన్న శస్త్రచికిత్స జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ నేరుగా ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ సందర్భం గా వైద్యులతో మాట్లాడిన కేసీఆర్.. హిమాన్షు ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన వైద్య విధానంపై కూడా ఆయన ఆరా తీసినట్టు సమాచారం.

శస్త్రచికి త్స నేపథ్యంలో కేటీఆర్ కుటుంబసభ్యులతోపాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా ఆస్పత్రిలో ఉన్నట్టు తెలుస్తున్న ది. అయితే హిమాన్షుకు జరగనున్నది సాధారణ శస్త్రచికిత్స మాత్రమేనని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్ప త్రి వర్గాలు తెలిపాయి. హిమాన్షు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, శస్త్రచికిత్స అనంతరం ఆయన త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం.