31 July, 2026 | 5:03 AM

సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలి

31-07-2026 02:12 AM

సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్

మహబూబ్‌నగర్ జూలై 30: ఖరీఫ్, రబీ సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాల ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్  శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. గురువా రం జిలా ్లలో పర్యటించి 202526 ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించిన కస్టమ్ మిలల్డ్ రైస్ (సీఎంఆర్) డెలివరీల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా భూత్పూర్ మం డలంలోని భాను పార్బాయిల్ రైస్ మిల్, తాటికొండలోని నరహరి పార్బాయిల్ రైస్ మిల్ను తనిఖీ చేసి మిల్లింగ్ ప్రక్రియ, బియ్యం నిల్వలు, సీఎంఆర్ సరఫరా పురోగతిని పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లు, ఎఫ్సీఐ అధికారులు, ఎన్ఫో ర్స్మెంట్ విభాగం అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2025 ఖరీఫ్, రబీ సీజన్ సీఎంఆర్ డెలివరీలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి, పెండింగ్లో ఉన్న డెలివరీలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.  ఎప్పటికప్పుడు పురోగ తిని పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.