2 March, 2026 | 12:14 AM

ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు రద్దు

01-03-2026 04:00 PM

న్యూఢిల్లీ: ఇరాన్, మధ్య ప్రాచ్యంలో దాడుల కారణంగా విమాన సర్వీసులు రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు గల్ఫ్ దేశాలకు 45 విమానాలు, ఢిల్లీ విమానాశ్రయం నుంచి 100 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు డీజీసీఏ ప్రకటించింది. 14 గంటలుగా ఢిల్లీ ఎయిర్ పోర్టు(Delhi Airport)లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడుల చేస్తున్న నేపథ్యంలో వాటి మిత్రదేశాలైన ఖతార్, అబుదాబి, సౌదీ అరేబియా, కువైట్ లపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. దీంతో ఆయా దేశాలు తమ విమానాశ్రయాలను మూసివేశాయి. 

మధ్య ప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైనిక పరిణామాల మధ్య, భారత విమానయాన సంస్థలు ముందుజాగ్రత్త చర్యగా తమ అంతర్జాతీయ షెడ్యూల్‌లలో మరిన్ని సర్దుబాట్లను ప్రకటించాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.