11 July, 2026 | 1:59 AM

అంగన్‌వాడీలకు ‘సర్’ డ్యూటీ రద్దు చేయాలి

11-07-2026 12:56 AM

మేడ్చల్, జూలై 10 (విజయక్రాంతి): అంగన్వాడీలకు కేటాయించిన బిఎల్ ఓ, సర్ డ్యూటీ ల ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగనవాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ బీఎల్‌ఓ, సర్ డ్యూటీ ల వల్ల అంగన్వాడి కార్యకర్తలపై పని భారం పెరుగుతోందని, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. తక్కువ వేతనాలు ఇస్తూ ఎక్కువ పని చేయిస్తున్నారని పేర్కొన్నారు.

అంగన్వాడీలకు కేటాయించిన బిఎల్‌ఓ, సర్ డ్యూటీలను తక్షణమే రద్దు చేయాలని, డ్యూటీ పేరు మీద వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్రీ ఫైర్ మరి స్కూల్స్ రద్దు చేయాలని అన్నారు. ఐసిడిఎస్ ను ప్రైవేటీకరించవద్దని, అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ, పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగనవాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సునీత, బి శోభారాణి, కోశాధికారి శివరాణి, స్వరూప, రమాదేవి, భాగ్య రేఖ, ఉన్ని కృష్ణన్ న్ తదితరులు పాల్గొన్నారు.