ముల్కనూర్ సంఘానికి ప్రతిష్ఠాత్మక అవార్డు
ఇక్రిశాట్ డైరెక్టర్ చేతుల మీదుగా ప్రదానం
పురస్కారాన్ని అందుకున్న జీఎం రామ్‌రెడ్డి
భీమదేవరపల్లి, జూలై 10 (విజయక్రాంతి): రైతుల జీవనోపాధి మెరుగుపరచడంలో విశేష కృషి అందించిన ముల్కనూర్ సహకార సంఘం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ మేరకు రైతు కేంద్రీకృత కార్యక్రమాలను గుర్తించి రైతులకు విశేష సేవలు అందిస్తున్నందుకు ముల్కనూర్ సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ మార్పాటి రామ్‌రెడ్డికి ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షుపాఠక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
హైదరాబాదులో ఇండియా సీడ్ ట్రేడ్ ఇన్నోవేషన్ 2026 ఇక్రిశాట్ హైదరాబాదులో జరిగిన ప్రపంచ విత్తన వాణి జ్యం సుస్థిర వ్యవసాయం ప్రోత్సహించే సదస్సులో ముల్కనూరు బ్యాంకు ఫార్మర్ సెం ట్రల్ ఇంపాక్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకుంది. నాణ్యమైన విత్తన ఉత్పత్తి ద్వారా రై తుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ముల్కనూర్ సహకార సంఘం ప్రత్యేక గుర్తింపు పొందింది. ముల్కనూర్ సహకార సంఘానికి అరుదైన గౌరవం రావడం పట్ల బ్యాంక్ అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వకారణమని కొనియాడారు.






