4 August, 2026 | 2:47 AM

ఐదు నెలల వేతనాలు విడుదల చేయాలి

04-08-2026 01:49 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మిషన్ భగీరథ ఎవరెస్ట్ ఏజెన్సీ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి డిమాండ్ చేశారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరిత కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.ప్రజలకు తాగునీరు అందించే కార్మికులను నెలల తరబడి వేతనాలు లేకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో మిషన్ భగీరథ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మికులు శ్రీకాంత్, జయకృష్ణ, విజయ్కుమార్, జితేందర్, తిరుపతి, మారుతి, ప్రతాప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.