29 July, 2026 | 2:11 AM

యాక్షన్ అనకాపల్లి

29-07-2026 01:09 AM

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్  బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకు ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో టాలీవుడ్ థండర్స్ టీమ్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ కొత్తగా ఉండటం, తారక్ పొన్నప్ప విలనిజం డిఫరెంట్‌గా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉండటంతో ఓ కొత్త ఫీల్ కలుగుతుంది.