13 May, 2026 | 2:01 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

కాటన్ మిల్‌లో అగ్ని ప్రమాదం

09-12-2025 03:35 PM

– అప్రమత్తతతో తప్పిన భారీ నష్టం

కల్వకుర్తి: కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులోని బాలాజీ కాటన్ మిల్‌లో శుక్రవారం  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లులో పనిచేస్తున్న సమయంలో యంత్రంలో షాక్ సర్క్యూట్ రావడంతో యంత్రం లోపలి భాగంలో మంటలు చెలరేగాయి. యంత్ర భాగాల్లో ఏర్పడిన ఘర్షణతో వెలువడిన నిప్పురవ్వలు సమీపంలో  పత్తికి అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు యజమానులు తెలిపారు. మంటలు ఒక్కసారిగా పైకి ఎగసిపడినా, సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ,5 లక్షల విలువైన పత్తి దగ్ధమైనట్లు  తెలుస్తుంది. సమయానికి  స్పందించడంతో భారీ నష్టం తప్పిందని ఫైర్ సిబ్బంది తెలిపారు.