8 May, 2026 | 3:56 AM

వైద్యభారానికి.. ‘సహాయ‘ ఊరట

08-05-2026 12:03 AM

బచ్చలకూరి చరణ్ కి రూ. 5 లక్షల ఎల్‌ఓసి అందజేత

మంత్రి పొంగులేటి చొరవతో ఆర్థిక వెసులుబాటు

కూసుమంచి, మే 7(విజయక్రాంతి): కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూరి చరణ్ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి కుమార్ సమస్యను దయాకర్ రెడ్డి గారి ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.

వెంటనే స్పందించిన మంత్రి బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి మంజూరు చేపించడం జరిగింది.  కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, సహకరించిన జొన్నలగడ్డ రవి కుమార్ కు, దయాకర్ రెడ్డికి, భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి, మునిగేపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.