ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం
25-06-2026 01:56 AM
రాజాపూర్ జూన్ 24: మండలంలోని ఖానాపూర్ గ్రామపంచాయతీకి చెందిన పూజారి నర్సింములు కూతురు చందన, సోమ్లా తండా నర్సింహులు నాయక్ కూతురు అనూష వివాహానికి బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు చించోడ్ అభిమన్యు రెడ్డి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బుధవారం అభిమన్యు యువసేన సభ్యులు వివాహా వేడుకలకు హాజరై ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి శేఖర్, ముస్తాఫా, రషీద్, దస్తగిర్, శ్రీను భారాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






