3 March, 2026 | 10:24 PM

ఆర్టీసీ కండక్టర్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం

03-03-2026 06:32 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ అంత్యక్రియలకు ఆ సంస్థ తరఫున ఆర్థిక సహాయం అందించారు. ఉట్నూర్ ఆర్టీసీ డిపో లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వేముల ఉషన్న అనారోగ్యంతో హైదరాబాదులోని ఆర్టీసీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐతే మృతి చెందిన కండక్టర్ ఉషన్న అంత్యక్రియల కోసం సంస్థ తరఫున దహన సంస్కారాలు నిమిత్తం రూ.30 వేల నగదును ఉట్నూర్ ఆర్టీసీ డిపో  క్యాషియర్ చంద్రశేఖర్ మృతుని స్వగ్రామం ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ తరఫున కండక్టర్ కుటుంబానికి అందవలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని  ఆయన వారికి తెలిపారు.