జనగణనపై షార్ట్ ఫిలిం చిత్రీకరణ
25-04-2026 09:07 PM
పాపన్నపేట: త్వరలో జరగబోయే జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మండల కేంద్రమైన పాపన్నపేటలో షార్ట్ ఫిలిం చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి పాపన్నపేట తెలుగు ఉపాధ్యాయులు అంజాగౌడ్ దర్శకత్వం వహించగా వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ముఖ్యంగా జనగణనలో తమ వివరాలు అందిస్తే, ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పథకాల నుండి తమ పేర్లు ఎక్కడ తొలగిస్తారో అన్న అపోహ నుండి ప్రజలను దూరం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. కెమెరామెన్ గా పుర్ర శ్రీకాంత్, ఎడిటర్ గా సంకీర్తన్ వ్యవహరించారు. అంతేకాకుండా జనగణనపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి, జనగణన కోసం తమ ఇండ్లకు వచ్చి ఎన్యూమరేటర్లకు సహకరించాల్సిందిగా వారు సూచించారు.






