26 June, 2026 | 2:02 AM

కౌంటర్ దాఖలు చేయండి

26-06-2026 12:30 AM
  1. ఎమ్మెల్యేలు దానం, బండ్లకు హైకోర్టు ఆదేశం
  2. జూలై 22కు పార్టీ ఫిరాయింపుల కేసు వాయిదా

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 2కు వాయిదా వేసింది. 2023లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలుమార్లు విచారణ చేపట్టి ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకోవడంలో విపలమయ్యారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఆధారాలు సమర్పించినా స్పీకర్ పార్టీ మా రిన 10 మందిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రిపోర్టులను సమర్పిం చాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం, ఎమ్మె ల్యే దానం అనర్హత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారగా, హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.