సర్‌ను రాజకీయ కోణంలో చూడొద్దు
- బీజేపీ శ్రేణులు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను విడతల వారీ గా చేపడుతున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతోందని, దీన్ని.. రాష్ట్ర ఓట ర్ల జాబితా సంస్కరణ ప్రక్రియగా చూడాలే తప్ప.. రాజకీయ కోణంలో చూడొద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కొన్నిపార్టీ లు, కొందరు రాజకీయ నాయకులు.. ఏదో జరిగిపోతోందంటూ రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని, ఇది సరికాదని హితవు పలికారు.
గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తం గా సర్ ప్రారంభమైన నేపథ్యంలో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు. సర్ ప్రక్రియ అనేది.. కేంద్ర ఎన్నికల సంఘం.. దేశవ్యాప్తంగా చేపడుతున్నటువం టి రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన కార్యక్రమమన్నారు. అర్హుడైన ప్రతి భారతీయ పౌ రుడికి ఓటుహక్కు ఉండాలి, అదే సమయం లో అక్రమ, నకిలీ, డూప్లికేట్ ఓటరు కార్డులను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీ న్ మార్గదర్శనంలో, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో.. అం దరు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు.. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా భాగ స్వాములు కావాలని ఆయన సూచించారు.






