17 March, 2026 | 6:51 PM

సమాచార హక్కు రక్షణ చట్టం ఐదవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి

17-03-2026 05:03 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సమాచార హక్కు రక్షణ చట్టం 2005,  5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ పిలుపునిచ్చారు. మంగళ వారం మఠంపల్లి మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ  పోస్టల్ ఆవిష్కరణ ను స్థానిక నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది.

మార్చి 24న జరిగే 5వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని,ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ సంస్థలలో  సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం తన బాధ్యత విధి అని ఆయన అన్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలలో జవాబుదారీతనాన్ని పారదర్శకతను పెంచడానికి, అవినీతిని అరికట్టడానికి, పౌరులకు సమాచారాన్ని అందించడానికి ఈ చట్టం దోహదపడుతుందని అన్నారు. అక్టోబర్ 12 - 2005 న ఈ చట్టం అమలులోకి వచ్చిందని దీని ప్రకారం ప్రతి భారతీయుడు ప్రభుత్వ, ప్రజా సంబంధిత కార్యాలయాల నుండి రికార్డులు, పత్రాలను, పనితీరును  పరిశీలించవచ్చు అని తెలియజేశారు.