1 June, 2026 | 2:46 AM

ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థినులు

01-06-2026 01:22 AM

కేసముద్రం, మే 31 (విజయక్రాంతి): కేసముద్రం మండలం కల్వల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఏం. సహస్ర, బి. నవ్య, బి. అనుష  ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఎంపికైనట్లు హెచ్ ఎం బండారు నరేందర్ తెలిపారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులై, ప్రతిష్టాత్మక బాసర త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలరని వీరు నిరూపించారని పేర్కొన్నారు.