సుమన్ అరెస్ట్‌కి నిరసనగా జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ రాస్తారోకో
చెన్నూర్, మే 31 :మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ చెన్నూర్, కోటపల్లి మం డలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీ య రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్య క్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నా యకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశా రు. అధికారం చేతిలో ఉందనే కారణంతో తె లంగాణ ఉద్యమకారుడైన బాల్క సుమ్ప అ క్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం హేయమైన చర్య అని విమర్శించారు.
రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జాతీయ రహదారిపై నిర్వహించిన ఆందోళనతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రా ఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే బా ల్క సుమన్ పైన పెట్టిన అక్రమ అరెస్ట్ ని పూర్తిగా ఎత్తివేయాలని లేని పక్షంలో పెద్ద ఎ త్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. సమాచారం అందుకున్న పోలీసులు జాతీ య రహదారి వద్దకు చేరుకుని ఆందోళన చే స్తున్న బిఆర్‌ఎస్ నాయకులకు సర్దిచెప్పడం తో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు.






