8 March, 2026 | 4:28 PM

ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్

08-03-2026 02:28 PM

కామారెడ్డిలో ముగ్గురు చిన్నారులను చిది మేసిన తండ్రి అరెస్టు, రిమాండ్

కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): అభము శుభము తెలియని ముగ్గురు చిన్నారులను చితిమేసిన తండ్రిని ఆదివారం కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఏ ఎస్ పి చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో ముగ్గురు చిన్నారుల హత్య కేసు నిందితుడి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి ఆర్బి నగర్ కు చెందిన ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదని పోలీసులకు శనివారం ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ముగ్గురు చిన్నారులు 10 సంవత్సరాలలోపు వారే కావడంతో కామారెడ్డి పట్టణ కేసు నమోదు చేసుకొని ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దర్యాప్తు మమ్మరం చేసినట్లు తెలిపారు.

ముగ్గురు చిన్నారులను శనివారం ఉదయం తండ్రి టిఫిన్ చేపించుకొని వస్తానని చెప్పి ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి ఇంటికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి మధ్యాహ్నం భర్తకు ఫోన్ చేయడంతో పిల్లలు ఇంటికి వస్తామని చెప్పి వెళ్లారని తాను ఆటో నడిపేందుకు వెళ్లాను చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తండ్రి చెప్పిన మాటలు అనుమానం రేకెత్తడంతో సిసి పూటేజీలను పరిశీలించిన పోలీసులకు అతడు చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చి అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా కామారెడ్డి పెద్ద చెరువులో

ముగ్గురు పిల్లలను తోసి వేసినట్లు చెప్పడంతో అక్కడికి పోలీస్ సిబ్బంది వెళ్లి కామారెడ్డి పెద్ద చెరువులో గాలించగా ఇద్దరు పిల్లల శవాలు లభ్యం కాగా మరొక చిన్నారి శవం 11 గంటలకు లభించినట్లు చైతన్య రెడ్డి వెల్లడించారు. చిన్నారుల తండ్రి ఇస్మాయిల్ నీ ఆదివారం అరెస్టు చేసి రీమాండ్ కు పంపినట్లు తెలిపారు. అప్పులు అవడంతో ఆర్థిక సమస్య లు తలెత్తినట్లు పిల్లలను పోషించడం కష్టంగా భావించి చెరువుల తోచి ముగ్గురు చిన్నారులను చoపినట్లు పిల్లల తండ్రి ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు ఏఎస్పి తెలిపారు.

పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని త్వరలో అతనిని కస్టడికి  తీసుకొని విచారణ చేపడతామని ఏఎస్పి వెల్లడించారు. గోసంగి కాలనికి చెందిన  మరో ఇద్దరు చిన్నారుల అదృశ్యం పై విచారణ కొనసాగుతుందని తెలిపారు. త్వరలోనే ఆ పిల్లల అదృశ్యం మిస్టరీని చేదిస్తామని తెలిపారు. కేవలం 10 గంటలలోనే ముగ్గురు చిన్నారుల అదృశ్యం మిస్టరీని ఛేదించిన కామారెడ్డి పట్టణ సిఐ నరహరి రూరల్ సీఐ సిబ్బందితో మూడు టీములతో సీసీ కెమెరాల పుటేజీల ను పరిశీలించి ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించినందుకు అభినందించారు.