రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతులకు జనుములు పంపినిచేసిన ఎమ్మెల్యే యాదయ్య
చేవెళ్ళ మే 25(విజయక్రాంతి): చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామం పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య రైతులకు జనుము విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... చేవెళ్ళ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొదటగా రైతులకు జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తుందన్నారు.
వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జనుము విత్తనాల పూర్తి ధర క్వింటాలుకు రూ.15,550/-కాగా ప్రభుత్వ 50 శాంతం సబ్సిడీతో రూ. 7,775/- లకు 40 కేజీల జనుము విత్తనాలు సబ్సిడితో రూ 3110/- చెల్లిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబెర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ళ పిఏసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, బక్కరెడ్డి రవీందర్ రెడ్డి, బక్కరెడ్డి యాదిరెడ్డి, రావులపల్లి సర్పంచ్ గోటూరి. రాంచంద్రయ్య, ముడిమ్యాల మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్గారి కార్తీక్ రెడ్డి, పడాల రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






