26 May, 2026 | 2:22 AM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

26-05-2026 12:47 AM

మధిర, మే24 (విజయక్రాంతి): లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు. సోమవారం మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య, అత్యవసర అవసరాల సమయంలో ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్, జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ మిరియాల వెంకటరమణ గుప్తా, కౌన్సిలర్ బాణావత్ వెంకటరమణ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.