తొలకరి కురువకముందే తొందరపాటు విత్తనాలు నాటడంలో రైతులు బిజీ బిజీ
08-06-2026 05:09 PM
బోథ్,(విజయక్రాంతి): తొలకరి జల్లులు కురవక ముందే విత్తనాలు నాటడంలో రైతులు బిజీ అవుతున్నారు. మృగశిర కార్తె రావడంతోనే రైతన్న విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం మండల కేంద్రంలో కొంతమంది రైతులు తమ చేలలో విత్తనాలు నాటారు. అయితే పులకరి జల్లుల పూర్వకముందే నేల పూర్తిస్థాయిలో తడవక ముందు విత్తనాలు నాటడం వల్ల నష్టం జరిగే ఆస్కారం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. నేల 60 శాతం తడిసినప్పుడే విత్తనాలు నాటాలని లేకుంటే విత్తనాలు నష్టపోతారని అంటున్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను పరిశీలించి విత్తనాలు నాటాల్సిన అవసరం ఉంది.






