30 April, 2026 | 3:08 AM

సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు

30-04-2026 12:37 AM

కొండపాక, ఏప్రిల్ 29: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని జల్లి పట్టకుండా గతంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి కి దుద్దెడ గ్రామ జిపిఓ ద్వారా వినతి పత్రం అందించారు. ప్రస్తుత వేసవి పరిస్థితులను దృశ్య  ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సరియైన వసతులు లేక ముఖ్యంగా కరెంటు సరిగా లేకపోవడం,

సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయక, సెంటర్ కు తీసుకువచ్చిన ధాన్యాన్ని జల్లి పట్టుమనడం, సరియైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడం తో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. గత సీజన్ మాదిరిగా నే జల్లి పట్టకుండానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇట్టి విషయంపై త్వరగా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ బాలాజీ, జిగురు యాదగిరి, జక్కుల ఓజయ్య, నర ప్రతాపరెడ్డి, జక్కుల శ్రీశైలం, గుండెల్లి నర్సింలు, ఇతర రైతులందరూ పాల్గొన్నారు.