15 August, 2026 | 1:56 AM

రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి

15-08-2026 12:28 AM

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి

తాడ్వాయి, ఆగష్టు 14 ( విజయ క్రాంతి): రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామంలో శుక్రవారం ఆయన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సహజ వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి తగ్గించుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందేలా రైతులు కృషి చేయాలన్నారు.

బీజామృతం యొక్క ప్రాముఖ్యత, విత్తన శుద్ధితో కలిగే లాభాలను వివరించారు.విత్తన శుద్ధి ద్వారా మొక్కలకు వచ్చే చీడపీడలను నివారించవచ్చని తెలిపారు.ఆత్మనిర్బర్ భారతం పథకం ద్వారా రైతులకు పంపిణీ చేసిన మినుము, కంది పంటలను ఆయన పరిశీలించారు. పురుగుల నివారణకు రైతులు బ్రహ్మాస్త్రమును పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సింలు, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు.