15 August, 2026 | 3:38 AM

రాజగోపాల్‌పై అధిష్ఠానం సీరియస్

15-08-2026 01:38 AM
  1. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది 
  2. పార్టీ లైన్‌ దాటి మాట్లాడితే సహించేది లేదు
  3. రాజగోపాల్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నా
  4. ఎంతపెద్ద నాయకుడైనా పార్టీనే ఫస్ట్
  5. కేసీఆర్ పాపాలను పోచారం ఆర్థం చేసుకోవాలి 
  6. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అధిష్ఠానం సీరియస్‌గా ఉందని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. బహిరం గంగా మాట్లాడడం సరికాదని, పార్టీ లైన్‌దాటి మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆయన ఆవేదనను తాను అర్థం చేసుకున్నాని, కానీ ఎంతపెద్ద నాయకుడైనా పార్టీనే ఫస్ట్ అని తెలిపారు.

మాజీ సీఎం కేసీఆర్ పాపాలను పోచా రం శ్రీనివాస్‌రెడ్డి ఆర్థం చేసుకోవాలని హితవు పలికారు. శుక్రవారం మహేష్‌కు మార్‌గౌడ్ గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందంచారు. సీఎం నుంచి కార్యకర్త వరకు పార్టీలో ఒక్కటేనని, ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందన్నారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించా రు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తనకు మంచి మిత్రుడు, ఆయన ఆవేదన అర్థం చేసుకున్నామని, పార్టీకి సంబం ధించి నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను పార్టీ గీత దాటి బహిరంగా మాట్లాడకూద న్నారు.

బిల్లుల విషయంలో ఒక క్రమ పద్దతిలో ముందుకు వెళ్లుతు న్నామని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా చేయడం లేదన్నారు. తమిళనాడు, తెలంగాణ రాజకీయాలు వేరన్నారు. సన్న బియ్యం కార్యక్రమం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడ లేదని, ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేయిస్తుందని విమర్శించారు. పార్టీలో సమర్థులైన వారికే పదవులు ఇస్తున్నామని, వచ్చే చైర్మన్ పదవుల్లో పాతవారికి 60 శాతం, కొత్త వారికి 40 శాతం పదవులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కేసీఆర్ చేసిన పాపాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆర్థం చేసుకోవాలని మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు. 

రాజగోపాల్‌రెడ్డిపై చర్యల సాహసం చేస్తుందా..?  

కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం నుంచి రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో  నాయకుల మధ్య వివాదాలు, ఒకరిపై విమర్శలు చేసుకోవడం జరుగుతోంది. కొందరి విషయంలో పార్టీ అధిష్ఠానం స్పందించి షోకాజ్ నోటీసులు ఇవ్వడం.. వారి నుంచి వివరణలు తీసుకోవడం పరిపా టిగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఇటీవల పార్టీ, ప్రభుత్వ పెద్దలపైన విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశగా మారాయి.

అంతకుముందు తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌పైన విమర్శలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి పదవీ ఇస్తామని అధిష్ఠానమే హామీ ఇచ్చినట్లుగా చెబుత్ను రు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ మరోసారి మంత్రి పదవీ హామీ ఇచ్చారు.

అయితే రాజగోపాల్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవులు ఇచ్చి.. రాజగోపాల్‌రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ విషయంలో రాజగోపాల్‌రెడ్డి మొదటి నుంచి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోందని పీసీసీ చీఫ్ చెబుతున్నా.. కాంగ్రెస్‌కు అంత సీన్‌లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.