మిఠాయి భండార్ తయారీ యూనిట్‌పై ఎస్‌ఓటి దాడి
పోలీసుల అదుపులో బాలాజీ హుక్మీచంద్ స్వీట్ షాప్ యజమాని
ఘట్‌కేసర్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న ’న్యూ బాలాజీ హుక్మీచంద్ మిఠాయి భండార్’ తయారీ యూన్పి శుక్రవారం ఎస్‌ఓటి ఉప్పల్ జోన్ బృందం దాడి చేసింది. అక్కడ గడువు ముగిసిన ముడి పదార్థాలు, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ను ఉపయోగించి అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
మిఠాయి దుకాణం యజమాని (తయారీ యూనిట్) రాజారామ్ కచ్వా (48)ను ఆధీనంలోకి తీసుకున్నారు. త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఆరెంజ్ రెడ్ సూపర్ 2 బాక్సులు, లెమన్ ఎల్లో బాక్సులు, త్రిశూల్ సింథటిక్ ఫుడ్ కలర్ బ్లూ స్టార్ 100 గ్రాములు, 3 సీసాలు, నంది సింథటిక్ ఫుడ్ కలర్ (ఎరుపు, పసుపు) 2 సీసాలు, బుష్ సింథటిక్ ఫుడ్ కలర్ 5 పెట్టెలు, శ్రీబ్రాండ్ సిట్రిక్ యాసిడ్ 500 గ్రాములు 2 ప్యాకెట్లు, తయారీకి సంబంధించిన స్వీట్లు, ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్కేసర్ పోలీసులు పేర్కొన్నారు.






