15 August, 2026 | 2:48 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

15-08-2026 12:29 AM

మేడ్చల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో   కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

సుమారు రూ.10,814 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ కారణంగా అనేక కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లు, మెమోలు నిలిపివేస్తున్నాయని.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షుడు భగత్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.