10 July, 2026 | 1:04 AM

రైతన్నలకు యూరియా 'యాప్' కష్టాలు

09-07-2026 04:14 PM

కోటపల్లి, (విజయక్రాంతి) : ఒక జిల్లాలో యాప్ ఓపెన్ అయితే, మరో జిల్లాలో క్లోజ్ అవుతుందని, రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దొంగచాటు అడ్డదారులు తొక్కుతోందని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ బాపు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురు వారం విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. రైతులందరికి ఒకేసారి యూరియా ఇచ్చే చేతగానితనాన్ని దాచడానికే జిల్లాకో రూలు, పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. సకాలంలో ఎరువులు అందక రైతన్నలకు కష్టాలు తప్పడం లేదని, యాప్ డ్రామాలు ఆపి వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు.