9 July, 2026 | 11:54 PM

ఎస్‌ఐఆర్-2026లో ఓటర్లకు అండగా బీఆర్ఎస్ నాయకులు

09-07-2026 04:13 PM

తంగళ్ళపల్లి,జూలై 9 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొని ఓటర్లకు ఫారాలు నింపడంలో సహకారం అందించారు. ఓటరు నమోదు ప్రక్రియ సులభంగా పూర్తయ్యేలా మార్గనిర్దేశం చేస్తూ అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గజబింకార్ రాజన్న, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ అంకారపు రవీందర్, కందుకూరి రామాగౌడ్, తిరునహరి భానుమూర్తి, టి. శ్రీనివాస్, పరికిపల్లి తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.